Ajit Agarkar, Team India Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్.. ముందున్న 5 భారీ సవాళ్లు..

|

Jul 05, 2023 | 8:46 AM

Ajit Agarkar, Team India Chief Selector: టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ పాత్రలో అగార్కర్ బాధ్యతలు, సవాళ్లు భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతానికి, అగార్కర్‌కు ఎదురుగా ఉన్న ఆ 5 సవాళ్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

1 / 7
టీమ్ ఇండియా చీఫ్ సెలక్టర్‌గా ఊహాగానాలు వినిపించిన పేరే, కన్ఫ్మాం అయింది. పురుషుల క్రికెట్ జట్టు కొత్త చీఫ్ సెలక్టర్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ ఎంపికయ్యాడు. బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ జులై 4న అగార్కర్ పేరును ప్రకటించింది.

2 / 7
అగార్కర్ గతంలో IPL జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సంబంధం కలిగి ఉన్నాడు. అక్కడ అసిస్టెంట్ కోచ్ పాత్రలో కనిపించాడు. ఇక ఇప్పుడు అతను టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అతని బాధ్యతలు, సవాళ్లు భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతానికి, అగార్కర్‌కు ఎదురుగా ఉన్న ఆ 5 సవాళ్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

3 / 7
టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరు? : ఈ ప్రశ్న భారత జట్టు కొత్త చీఫ్ సెలెక్టర్ ముందు అతిపెద్దదిగా నిలిచింది. రోహిత్ శర్మ వయసు మీద పడుతోంది. అతని వయస్సు కూడా అతని ఫిట్‌నెస్, ఫామ్‌పై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం రోహిత్ భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రపంచకప్‌ వరకు కూడా ఉంటాడు. కానీ, ప్రశ్న ఏమిటంటే, అతను కాకపోతే ఎవరు? సమాధానం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లో కనుగొనాల్సి ఉంటుంది.

4 / 7
ఆటగాళ్ల పనిభారం: మెరుగైన జట్టును తయారు చేయడానికి, ఆటగాళ్ల పనిభారాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. రాబోయే కాలంలో భారత్ ఎన్నో భారీ సిరీస్‌లు, టోర్నీలు ఆడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టు కొత్త చీఫ్ సెలక్టర్ ముందు ఇది పెద్ద సవాల్‌గా మారనుంది. బలమైన, ఫిట్ టీమ్ ఇండియాను తయారు చేయడం చాలా ముఖ్యం.

5 / 7
టీ20 జట్టును సిద్ధం చేయడం: ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఉంది. వచ్చే ఏడాది అంటే 2024లో టీ20 ప్రపంచకప్ ఆడాల్సి ఉంది. అందుకోసం ఒక బలమైన జట్టును తయారు చేయడం, ఎంపిక చేసుకోవడం అజిత్ అగార్కర్ ముందు సవాలుగా ఉంటుంది.

6 / 7
టీమ్ ఇండియాలో మార్పులు: భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు తమ కెరీర్ చివరి దశలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో వన్డే ప్రపంచకప్ తర్వాత, టీమ్ ఇండియాలో మార్పుల దశ ప్రారంభమవుతుంది. అంటే సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టడం ద్వారా వారి స్థానంలో యువ ఆటగాళ్లకు ఆ బాధ్యత అప్పగించి భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. దీని కోసం అజిత్ అగార్కర్ వ్యూహం రచించవలసి ఉంటుంది.

7 / 7
ఆసియా కప్, ODI ప్రపంచ కప్ జట్టు: చీఫ్ సెలెక్టర్‌గా మారిన అజిత్ అగార్కర్ ముందు ఉన్న అతిపెద్ద సవాలు రెండు టోర్నమెంట్‌లకు జట్టును ఎంపిక చేయడం. ఒకటి ఆసియా కప్, మరొకటి ODI ప్రపంచకప్. ఈ రెండు టోర్నీల్లోనూ భారత్ భవితవ్యం ఆయన ఎంపిక ద్వారానే నిర్ణయించబడుతుంది.