
IND vs AUS: భారత్ వేదికగా జరగబోయే వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత నవంబర్-డిసెంబర్ మధ్య కాలంలో టీమిండియా ఆసీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ భారత్‌లోనే జరుగుతుంది.

SA vs IND: డిసెంబర్-జనవరి మధ్యలో భారత్.. సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. అక్కడ ఆతిథ్య జట్టుతో టీమిండియా 2 టెస్టులు, 3 వన్డేలుI, 3 టీ20 మ్యాచ్‌ల్లో తలపడుతుంది.

IND vs ENG: టీమిండియాతో 5 టెస్టుల సిరీస్ ఆడేందుకు జనవరి-మార్చిలో ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది.

T20 World Cup 2024: జూన్ నెలలో వెస్టిండీస్, ఆమెరికా వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో టీమిండియా ఆడనుంది.

SL vs IND: జూలైలో టీమిండియా 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది.

BAN vs IND: సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటించి ఆతిథ్య జట్టుతో 2 టెస్టులు, 3 టీ20లు ఆడుతుంది.

NZ vs IND: అలాగే అక్టోబర్‌లో న్యూజిలాండ్ వెళ్లి కివీస్ ప్లేయర్లతో టీమిండియా 3 టెస్టులు ఆడుతుంది.

ఇంకా 2024 చివర్లలో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. కంగారుల జట్టు తన పర్యటనలో భాగంగా టీమిండియాతో 5 టెస్టులు ఆడుతుంది.