Venkata Chari |
Jan 22, 2023 | 6:52 AM
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. మరి వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ ఎవరో చూద్దాం..
కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 494 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ.. 300 క్యాచ్‌లు అందుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 2వ భారత ఆటగాడిగా, అలాగే ప్రపంచ క్రికెట్‌లో 7వ ప్లేయర్‌గా కింగ్ కోహ్లీ అవతరించాడు.
2009 నుంచి 2011 వరకు స్వదేశంలో భారత్ వరుసగా ఆరు వన్డే సిరీస్‌లను గెలుచుకుంది. 2016 నుంచి 2018 వరకు, టీమిండియా స్వదేశంలో ఇదే పని చేసి ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లను కైవసం చేసుకుంది.
2013 నుంచి 2014 వరకు టీమిండియా స్వదేశంలో వరుసగా ఐదు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను గెలుచుకోవడంలో విజయవంతమైంది.
2016 నుంచి స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. 2019లో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించింది.