Credit Card: క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు..

Updated on: Mar 12, 2026 | 9:00 PM

నేటి కాలంలో షాపింగ్ నుండి ప్రయాణాల వరకు ప్రతిదానికీ క్రెడిట్ కార్డులే ప్రధాన ఆధారంగా మారాయి. అయితే వీటి వాడకంపై మరింత పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు కీలక మార్పులు చేపట్టాయి. ఈ కొత్త నియమాలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. వీటిపై అవగాహన లేకపోతే వినియోగదారులు ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.

1 / 5
 పాన్ కార్డు ఇప్పుడు తప్పనిసరి: ఇకపై కొత్తగా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి పాన్ కార్డు ఉండటం అనివార్యం. పాన్ నంబర్ లేని ఏ దరఖాస్తును కూడా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ప్రాసెస్ చేయవు. నకిలీ ఖాతాలను అరికట్టడానికి, క్రెడిట్ కార్డు ఖర్చులను నేరుగా పన్ను వ్యవస్థతో అనుసంధానించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

2 / 5
ఐటీ శాఖ నిఘా:  మీ క్రెడిట్ కార్డ్ ఖర్చులపై ఆదాయపు పన్ను శాఖ కన్నేసి ఉంచబోతోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు నిర్వహిస్తే, సదరు బ్యాంకులు ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి. క్రెడిట్ కార్డ్ బిల్లును రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో నగదు రూపంలో చెల్లించినా ఆ సమాచారం కూడా ఐటీ శాఖకు చేరుతుంది.

3 / 5
క్రెడిట్ కార్డుతోనే ఆదాయపు పన్ను చెల్లింపు: పన్ను చెల్లింపుదారులకు ఒక సౌకర్యవంతమైన మార్పు రాబోతోంది. ఇకపై మీ ఆదాయపు పన్నును కూడా క్రెడిట్ కార్డు ఉపయోగించి చెల్లించవచ్చు. అయితే ఇలా చేసేటప్పుడు బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు మరియు ప్రాసెసింగ్ ఫీజుల గురించి ముందే తెలుసుకోవడం మంచిది.

4 / 5
పన్ను మినహాయింపు: కంపెనీలు జారీ చేసే క్రెడిట్ కార్డులను ఉపయోగించే ఉద్యోగులకు ఒక మంచి వార్త. యజమాని అనుమతితో చేసే అధికారిక ఖర్చులపై ఉద్యోగులు పన్ను మినహాయింపు పొందవచ్చు. కానీ దీనికి సంబంధించి సరైన డాక్యుమెంటేషన్, ధృవీకరణ పత్రాలు సమర్పించడం తప్పనిసరి.

5 / 5
క్రెడిట్ కార్డుల వాడకం పెరగడంతో పాటు దుర్వినియోగం కూడా పెరుగుతోంది. అందుకే ఈ కొత్త నిబంధనలను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని మీ ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

Follow Us