
కరోనా వైరస్‌కు పుట్టినిల్లైన చైనాలో మళ్లీ వైరస్ బుసలు కొడుతోంది. భారతదేశంలో కూడా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ BF7 వెలుగు చూడడంతో మరోసారి దేశంలో కరోనా కలకలం రేపుతోంది. ఈ మహమ్మారి నుంచి రక్షణ పొందాలంటే బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం అవసరం. ఇందుకు కొబ్బరి నీళ్లు ఎంతో ఉత్తమం.

ప్రతిరోజూ కొబ్బరి నీళ్లలో కాసిన్ని చియా గింజలను నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని తీసుకుంటే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే మిగిలిన కొబ్బరి నీటిని తాగవచ్చు.

కొబ్బరి నీటి స్మూతీని రెడీ చేసేందుకు చియా గింజలు, వాల్‌నట్స్ ఇతర నట్స్‌ను కలుపుకోవచ్చు. ఉదయాన్నే నీళ్లతో కలిపి గ్రైండ్ చేస్తే స్మూత్ గా తయారవుతుంది. కావాలంటే కాసింత ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఈ సూపర్ ఫుడ్‌తో శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలపడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి పాత్ర ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

కొబ్బరి నీళ్లు తాగడం ఇష్టం లేకపోతే కొబ్బరి పాలను కూడా తీసుకోవచ్చు. పైగా ఇందులో కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది కాకుండా మెగ్నీషియం, విటమిన్ సి, ఫాస్పరస్ మరియు పొటాషియం వంటి పోషకాల లోపాన్ని కూడా భర్తీ చేయవచ్చు.