ఈ నూనెలో ఒక చెంచా కాఫీ పొడి మిక్స్ చేసి రాస్తే తెల్ల జుట్టు 20 నిమిషాల్లో నల్లగా మారుతుంది..!

| Edited By: TV9 Telugu

May 30, 2024 | 3:51 PM

చాలామంది తమ రోజును కాఫీతో ప్రారంభిస్తారు. ఉదయం పూట ఒక కప్పు వేడి కాఫీ తాగితే రోజంతా ఫ్రెష్ గా ఉంటుంది. దాని సువాసన ప్రజలను తనవైపు ఆకర్షిస్తుంది. కాఫీలో పొటాషియం, మెగ్నీషియం, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. అదే కాఫీ జుట్టు, చర్మానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మీకు తెలుసా? అవును జుట్టు పెరుగుదలకు కాఫీ సహాయపడుతుంది. శరీరానికి అలాగే జుట్టుకు ప్రయోజనకరంగా భావించే కాఫీలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి జుట్టును రక్షించడంలో సహాయపడతాయి. దీనితో పాటు, కాఫీలోని కెఫిన్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. జుట్టు పొడవుగా, నల్లగా, ఒత్తుగా చేయడానికి కాఫీని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.

1 / 5
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి కాఫీ, కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనెలో ఒక చెంచా కాఫీ పొడి వేసి బాగా కలపాలి. దీన్ని పూర్తిగా జుట్టుకు పట్టించాలి. కాసేపు మసాజ్ చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూ ఉపయోగించి జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఉత్తమ ఫలితాల కోసం వారానికి రెండుసార్లు ఈ హెయిర్ మాస్క్‌ని ఉపయోగించండి. కొబ్బరి నూనెలో ప్రోటీన్, విటమిన్ ఇ, యాంటీ-ఆక్సిడెం,  యాంటీ ఇన్ఫ్లమేటరీ పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

2 / 5
కాఫీ, కలబంద కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. ఒక గిన్నెలో రెండు చెంచాల అలోవెరా జెల్, ఒక చెంచా కాఫీ పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను స్కాల్ప్, హెయిర్‌కి అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి. 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. ఉత్తమ ఫలితాల కోసం, వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్‌ని ఉపయోగించండి.

3 / 5
కాఫీ, పెరుగు మాస్క్..పెరుగు జుట్టుకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టును సిల్కీగా మార్చడంలో సహాయపడుతుంది. దీని నుండి హెయిర్ మాస్క్ చేయడానికి, ఒక కప్పు తాజా పెరుగు తీసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ కాఫీ పోడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి నిమ్మరసం కూడా కలపండి. ఇప్పుడు దీన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత నీటితో కడగాలి.

4 / 5
కాఫీ పొడి, తేనె ప్యాక్..తేనె జుట్టును బలపరుస్తుంది. దీని కోసం, ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడిని తీసుకోండి, దానికి తేనెను యాడ్ చేయాలి.. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు జుట్టు మీద అప్లై చేయండి. సుమారు 20 నిమిషాల తర్వాత నీటితో కడగాలి.

5 / 5
కాఫీ పౌడర్, కాస్టర్ ఆయిల్..ఈ హెయిర్ మాస్క్ చేయడానికి, ఒక గిన్నెలో ఒకటి లేదా రెండు చెంచాల కాఫీ పొడిని తీసుకుని, దానికి ఆముదం కలపండి. దీని నుండి మందపాటి పేస్ట్‌ను సిద్ధం చేసి, ఇప్పుడు మీ జుట్టుకు అప్లై చేయండి. సుమారు గంట తర్వాత షాంపూతో కడగాలి.