Phani CH |
Aug 23, 2022 | 9:07 PM
దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లైగర్ మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది.
డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి.
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ సినిమై మరింత హైప్ పెంచాయి.
అయితే బాక్సర్ గా కనిపించేందుకు ఫైటర్ బాడీ పొందేందుకు విజయ్ దాదాపు 2 ఏళ్లు శిక్షణ తీసుకున్నాడట. అంతేకాకుండా మైక్ టైసన్‌తో చేసే సన్నివేశం కోసం తనను తాను పూర్తిగా సిద్ధం చేసుకున్నాడని అతని ఫిట్ నెస్ కోచ్ కుల్ దీప్ సేథీ తెలిపారు.
ఇటీవల ఇండియన్ ఎక్స్ ప్రెస్ డాట్ కామ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ఫిట్ నెస్ కోచ్ కుల్ దీప్ సేథీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.