Saindhav: యాక్షన్ ప్లస్ ఎమోషన్‌తో అదిరిన ట్రైలర్

| Edited By: Phani CH

Jan 05, 2024 | 1:36 PM

సంక్రాంతి సినిమాల్లో మరో ట్రైలర్ వచ్చేసింది.. ఇప్పటికే ఈగల్‌తో పాటు హనుమాన్ ట్రైలర్స్ వచ్చి యూ ట్యూబ్‌లో రచ్చ చేస్తున్నాయి. తాజాగా సైంధవ్ కూడా రంగంలోకి దిగాడు. మరి వెంకటేష్ సినిమా ఎలా ఉండబోతుంది.. మెడికల్ బ్యాక్‌డ్రాప్‌లో గణేష్ మాదిరే వెంకీ మరో మాస్టర్ పీస్ ఇవ్వబోతున్నారా..? అసలు సైంధవ్ ట్రైలర్ రివ్యూ ఏంటి..? సంక్రాంతి సినిమాలన్నీ ముస్తాబవుతున్నాయి. ఎవరికి ఎవరు తగ్గేలా కూడా కనిపించడం లేదు. కచ్చితంగా చెప్పినట్లుగానే అందరూ అనుకున్న తేదీకే వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్ కూడా జనవరి 13న సైంధవ్‌తో బరిలోకి దిగుతున్నారు.

1 / 5
సంక్రాంతి సినిమాల్లో మరో ట్రైలర్ వచ్చేసింది.. ఇప్పటికే ఈగల్‌తో పాటు హనుమాన్ ట్రైలర్స్ వచ్చి యూ ట్యూబ్‌లో రచ్చ చేస్తున్నాయి. తాజాగా సైంధవ్ కూడా రంగంలోకి దిగాడు. మరి వెంకటేష్ సినిమా ఎలా ఉండబోతుంది.. మెడికల్ బ్యాక్‌డ్రాప్‌లో గణేష్ మాదిరే వెంకీ మరో మాస్టర్ పీస్ ఇవ్వబోతున్నారా..? అసలు సైంధవ్ ట్రైలర్ రివ్యూ ఏంటి..?

2 / 5
సంక్రాంతి సినిమాలన్నీ ముస్తాబవుతున్నాయి. ఎవరికి ఎవరు తగ్గేలా కూడా కనిపించడం లేదు. కచ్చితంగా చెప్పినట్లుగానే అందరూ అనుకున్న తేదీకే వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్ కూడా జనవరి 13న సైంధవ్‌తో బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇది చూస్తుంటే శైలేష్ కొలను మరో హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు.

3 / 5
ఇది మెడికల్ మాఫియా చుట్టూ తిరిగే కథ అని ఇంట్రడక్షన్ వీడియోతో పాటు టీజర్‌లోనే చూపించారు. ఇప్పుడు ట్రైలర్‌లో ఇంకాస్త డీప్‌గా వెళ్లారు శైలేష్ కొలను. కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. ఎమోషన్ కూడా హైలైట్ చేసారు శైలేష్. వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ హీరో.. ఆ ఇమేజ్‌కు న్యాయం చేసేలా సైంధవ్‌లో కూతురు సెంటిమెంట్ బలంగా చూపిస్తున్నారు.

4 / 5
గతంలోనూ సంక్రాంతి వెంకటేష్‌కు బాగా కలిసొచ్చింది. 35 ఏళ్ళ కెరీర్‌లో పండక్కి 13 సార్లు పండక్కి వచ్చారు వెంకీ. 1988 నుంచే వెంకటేష్ సంక్రాంతి వేట మొదలైంది. తొలిసారి రక్తతిలకంతో వచ్చి హిట్ కొట్టారీయన. ఆ మరుసటి ఏడాది ప్రేమ సినిమాతో వచ్చారు. 1992 సంక్రాంతికి విడుదలైన చంటి వెంకటేష్ కెరీర్‌ను మార్చేసింది. అయితే 1995లో పోకిరి రాజా, 96లో ధర్మచక్రం, 97లో చిన్నబ్బాయి వెంకటేష్‌ను నిరాశ పరిచాయి.

5 / 5
2000 సంక్రాంతికి కలిసుందాం రాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టారు వెంకీ. ఇక 2001లో దేవీ పుత్రుడు ప్రశంసలు తీసుకురాగా.. 2006లో లక్ష్మీ కాసుల వర్షం కురిపించింది. 2010లో నమో వెంకటేశా, 2012లో బాడీగార్డ్‌ నిరాశ పరిచాయి. ఇక 2013 సంక్రాంతికి సీతమ్మ వాకిట్లో అంటూ మహేష్‌తో పాటు వచ్చి హిట్ కొట్టారు వెంకీ. 2015 గోపాలా గోపాలా, 2019 ఎఫ్ 2 వెంకటేష్‌కు కలిసొచ్చాయి. ఐదేళ్ళ తర్వాత సైంధవ్‌తో మరోసారి పండగ రేసులోకి వస్తున్నారు వెంకటేష్.