
ప్రేమ.. మాటలకందని ఈ మధురానుభూతి సినిమా ఇండస్ట్రీకి ఇంట్రెస్ట్రింగ్ సబ్జెక్టు. అందుకే ప్రేమకథా చిత్రాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. వీటిని చూసేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. మరి ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) సందర్భంగా ఈ ఏడాది విడుదల కానున్న లవ్‌స్టోరీలేంటో తెలుసుకుందాం రండి.

సమంత కీలక పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నాడు. అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల- దుష్యంతుల ప్రేమకావ్యం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది.

పవన్ కల్యాణ్, భూమిక జంటగా నటించిన 'ఖుషి' ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడీ ఇదే పేరుతో మరో చిత్రం రానుంది. విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నాడు. శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఈ ప్రేమకథాచిత్రం వేసవిలో రిలీజ్ కానుంది.

నాని, కీర్తిసురేశ్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం దసరా. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అంతర్లీనంగా మంచి ప్రేమకథ ఉందని తెలుస్తోంది. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీదేవి శోభన్‌బాబు పేరుతో తెరకెక్కుతోన్న ప్రేమకథా చిత్రంలో సంతోష్ శోభన్, గౌరి జి. కిషన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 18న ఈ లవ్‌స్టోరీ రిలీజ్ కానుంది.

వీటితో పాటు కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశిల వినరో భాగ్యము విష్ణుకథ (ఫిబ్రవరి 18 విడుదల), నవీన్ పొలిశెట్టి-అనుష్కల మూవీ, నాగశౌర్య, మాళవిక నాయర్‌ల ' ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి' (మార్చి 17 రిలీజ్), ఆనంద్ దేవరకొండ, వైష్ణవిల బేబీ కూడా ఆసక్తికర ప్రేమకథలే.