
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

మూడేళ్ల విరామం తర్వాత పవన్ వెండితెరపై కనిపించడంతో అటు అభిమానులే కాదు, మెగా కుటుంబ సభ్యులు కూడా థియేటర్ కు వచ్చి మరీ వకీల్ సాబ్ చిత్రాన్ని వీక్షించారు.

మెగాస్టార్ చిరంజీవి, ఆయన తల్లి అంజనా దేవి, సోదరి, వరుణ్ తేజ్, సాయితేజ్, నాగబాబు హైదరాబాదులోని ఏఎంబీ మల్టీప్లెక్స్ థియేటర్ లో సినిమా చూశారు.

మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ వకీల్ సాబ్ సినిమాను మొదటి రోజే థియేటర్ లో చూసారు.

మెగా బ్రదర్ నాగబాబు ఆయన సతీమణితో కలిసి వకీల్ సాబ్ సినిమాను వీక్షించారు.

అలాగే యంగ్ హీరో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా వకీల్ సాబ్ సినిమాను థియేటర్ లో చూసారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వకీల్ సాబ్ సినిమా చేసేందుకు వెళ్తున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.