
ఊర్వశి రౌటెలా తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఆ కార్యక్రమంలోని ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ అమ్మడు ధరించిన డ్రెస్ పై కొందరు పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తే మరికొందరు ట్రోలింగ్ చేస్తున్నారు.

పారిస్ ఈవెంట్‌కు ఈ బ్యూటీ 3డీ ఫ్లోరల్ డ్రెస్‌లో అటెండ్ అయ్యింది. ప్రస్తుతం ఈమె డ్రెస్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఈ అమ్మడు బ్లాక్ అండ్ ఎల్లో కలర్‌లో ఉన్న గౌన్ ధరించింది. అందులో బ్లాక్ కలర్ ఫాబ్రిక్ మీద పెద్ద పెద్ద పూల డిజైన్స్‌తో ఈ డ్రెస్ అందరినీ ఆకట్టుకుంటుంది. బంగారు రంగులోని ఝుమ్కీలు, ఎత్తైన పోనీతో రాయల్ లుక్ టచ్ ఇచ్చింది.

అయితే ఊర్వశి రౌటెలా డ్రెస్ పై ఓ యూజర్ అందమైన ఊర్వశి అని కామెంట్ చేయగా, మరొకరు ఉర్ఫీ జావేద్ నీకంటె మెరుగ్గా దుస్తులు ధరిస్తుందంటూ కామెంట్ చేశారు.

ఇంకో యూజర్ ఇది ఫ్యాషన్‌నా లేదా ఆప్టికల్ భ్రమనా , ఇది ఓ తోటలా కనిపిస్తుంది అని మరొకరు, ఇలా ఒకొక్కరూ ఒక్కో అభిప్రాయం తెలపడంతో ఇప్పుడు ఊర్వశి పారిస్ లుక్ నెట్టింట చర్చానీయాంశం అవుతోంది.

ఇక ఊర్వశి రౌటెలా ఇటీవల బాలయ్య డాకుమాహారాజ్ సినిమాలో దబిడి దిబిడే అంటూ ఐటమ్ సాంగ్ చేసి అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ, బాలీవుడ్‌లో పలు సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం.