
సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు లైన్‌లో పెట్టేస్తున్నారు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ కోసం చేసిన ప్రయత్నం ఫెయిల్ అవ్వటంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సాయి శ్రీనివాస్.. మళ్లీ బిజీ అవుతున్నారు.

అల్లుడు శీను సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ స్టార్టింగ్ నుంచి భారీ బడ్జెట్ మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు.

అయితే ఇప్పటి వరకు కెరీర్‌లో బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ హిట్ ఒక్కటి కూడా పడకపోవటంతో స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయారు. రీసెంట్‌గా ఛత్రపతి రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా వర్కవుట్ కాలేదు.

భారీ ఆశలు పెట్టుకున్న రీమేక్ డిజాస్టర్ అయ్యింది. దీంతో షార్ట్ బ్రేక్ తీసుకున్న బెల్లంకొండ హీరో మళ్లీ టాలీవుడ్ మీద ఫోకస్ చేశారు. వరుస సినిమాలను లైన్ పెట్టి బిగ్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం టైసన్ నాయుడు వర్క్‌లో బిజీగా ఉన్న సాయి శ్రీనివాస్, మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా..

యాక్షన్ ఓరియంటెడ్, కంటెంట్ డ్రివెన్ సబ్జెక్ట్స్‌ను పిక్ చేసుకుంటున్నారు. మరి ఈ సినిమాలైనా బెల్లంకొండ హీరోకు సక్సెస్ ఇస్తాయేమో చూడాలి.