
టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖికి భక్తి భావం ఎక్కువ. టీవీ షోలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరుతుందీ అందాల తార.

కొన్ని రోజుల క్రితం తిరుమల శ్రీవారు, అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్న ఆమె తాజాగా శ్రీశైలం మల్లికార్జునడిని దర్శించుకుంది.

మంగళవారం (డిసెంబర్ 02) శ్రీ శైలం మల్లికార్జునుడిని దర్శించుకుంది శ్రీముఖి.స్వామి వారికి ప్రత్యేక పూజలు చసి మొక్కలులు తీర్చుకుంది.

తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీముఖి. దీంతో అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.

శ్రీముఖి శ్రీశైలం యాత్రకు సంబంధించిన ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఆమె చాలా క్యూట్ గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

కాగా సీరియల్స్ తో పాటు అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తోంది శ్రీముఖి. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది