బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని, ప్రపంచవ్యాప్తంగా 133 కోట్ల వసూళ్లను రాబట్టింది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి మూవీ కూడా బాలయ్యకు మంచి హిట్ ఇచ్చింది. ఈ సినిమా 134 కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే.
అలాగే అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా సైతం రూ.132 కోట్లు వసూలు చేసి నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చింది.
ఇక తాజాగా 2025లో బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు కాగా, ఈ మూవీ ఇప్పటికే 100కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.