
ఆర్య సినిమా కథను ముందుగా దర్శకుడు సుకుమార్ జూనియర్ ఎన్టీఆర్‌కు చెప్పాడంట. కానీ తారక్ కథ విన్న తర్వాత సినిమాను రిజక్ట్ చేసినట్లు సమాచారం.

బోయపాటి శ్రీను, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన భద్ర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ మూవీ కథను దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్‌కు వినిపించగా, డేట్స్ ఖాళీ లేవని ఆయన సినిమాను రిజెక్ట్ చేశాడంట.

ఇక నందమూరీ కళ్యాణ్ రామ్ నటించిన అతనొక్కడే, రవితేజ కిక్ సినిమాను కూడా జూనియర్ ఎన్టీఆర్ రిజక్ట్ చేశారు. కానీ ఈ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.

అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఊపిరి సినిమా కథను కూడా డైరెక్టర్ ముందుగా, ఎన్టీఆర్‌కు వినిపించాడంట. కానీ నాగార్జున కాళ్లు పట్టుకోవాల్సిన సన్నివేశాలు ఉండటంతో, దీని వలన తన అభిమానుల నుంచి సమస్యలు వస్తాయని భావించి మూవీని రిజెక్ట్ చేశారంట.

ఇవే కాకుండా నితిన్ దిల్ మూవీ, రవితేజ రాజా ది గ్రేట్, మహేష్ బాబు బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు వంటి సినిమాలన్నింటిని జానియర్ ఎంటీఆర్ రిజెక్ట్ చేశారు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.