
బ్రిడ్జర్టన్ సీజన్ 4. ప్రేమకథా గాథ బ్రిడ్జర్టన్ తన నాలుగవ సీజన్‌తో తిరిగి వచ్చింది. ఈ సీజన్ బెనెడిక్ట్ బ్రిడ్జర్టన్ , సోఫీ పెక్‌ల మధ్య ఉన్న సిండ్రెల్లా తరహా ప్రేమకథను చూస్తుంది. ఒక ముసుగుల డ్యా్న్సులలో తాను కలిసిన 'వెండి దుస్తులలోని సీక్రెట్ అమ్మాయి గుర్తింపు కోసం వెతుకుతున్న క్రమంలో, బెనెడిక్ట్ తెలియకుండానే ఒక పనిమనిషితో ప్రేమలో పడతాడు. వారి ప్రేమ సామాజిక హోదా, వర్గ భేదాలను అధిగమిస్తుందా లేదా అనేదే ఈ కథ. ఈ సిరీస్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది.

టీచ్ యు ఎ లెసన్. ఇది దక్షిణ కొరియా విద్యా వ్యవస్థలో బెదిరింపులు, అధికార దుర్వినియోగం వంటి సమస్యాత్మక సమస్యలను అన్వేషించే ఒక యాక్షన్-ప్యాక్డ్ కొరియన్ డ్రామా సిరీస్. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన 'గెట్ స్కూల్డ్' అనే వెబ్‌టూన్ ఆధారంగా రూపొందించబడింది. ప్రస్తుతం ఆ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ సిరీస్ కు అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

అతడు & ఆమె. మాజీ న్యూస్ యాంకర్ అన్నా ఆండ్రూస్ తన సొంత ఊరిలో జరిగిన ఒక హత్య కేసును దర్యాప్తు చేయడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఆమె, ఆ కేసుకు ప్రధాన దర్యాప్తు అధికారి, తన నుండి విడిపోయిన భర్త అయిన డిటెక్టివ్ జాక్ హార్బర్‌ను కలుస్తుంది. పాతిపెట్టిన నిజాలు, రహస్యాలు బయటపడటంతో ఈ హత్య కేసు ఒక సైకలాజికల్ థ్రిల్లర్‌గా మారుతుంది, ఇందులో టెసా థాంప్సన్ , జాన్ బెర్న్‌థాల్ అద్భుతమైన నటనను కనబరిచారు.

వన్ పీస్ సీజన్ 2. ఈ సీజన్‌లో మంకీ డి. లూఫీ, అతని 'స్ట్రా హాట్ పైరేట్స్' బృందం గ్రాండ్ లైన్‌లోకి ప్రవేశించి, తమ అత్యంత ప్రమాదకరమైన సాహసాన్ని కొనసాగిస్తారు. ఈ సీజన్ చివరిలో పరిచయం కానున్న 'సర్ క్రొకడైల్' అనే పాత్ర, తర్వాతి సీజన్‌పై భారీ అంచనాలను రేకెత్తించింది. అనుక్షణం ఉత్కంఠ మధ్య ఈ సిరీస్ సాగుతూ ప్రేక్షక్షులను కట్టిపడేస్తుంది.

ది వండర్‌ఫూల్స్.1990ల చివరలో సాగే ఈ కథ, ప్రపంచం అంతమైపోతుందనే భయం ప్రజలలో వ్యాపించడం మొదలైన తరుణంలో, సమాజం వెలివేసిన కొందరు సాధారణ ప్రజలకు ఊహించని, అనియంత్రిత అద్భుత శక్తులు లభిస్తాయి. ఆ తర్వాత వారి జీవితాలు ఎలా తలక్రిందులయ్యాయో ఈ కథలో ఆసక్తికరంగా చూపించారు. ఈ సిరీస్ మీకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.