
కెరీర్‌లో ఎవరూ ఊహించని కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ అండ్ దళపతి విజయ్. బాలయ్యకు కలిసొచ్చిన ఆ విషయం.. ఇప్పుడు విజయ్‌కి కూడా ప్లస్ అవుతుందా? ఎన్నికల ముందు బాలయ్య వేసిన స్టెప్‌ని.. విజయ్ ఎందుకు ఫాలో అవ్వాలనుకుంటున్నారు? ఇండస్ట్రీలో స్పీడ్‌గా వైరల్ అవుతున్న విషయం గురించి ఎక్స్ క్లూజివ్‌గా మాట్లాడుకుందాం పదండి...

నందమూరి బాలకృష్ణ, కాజల్, శ్రీలీల నటించిన భగవంత్ కేసరి తెలుగు సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. ఆడపిల్లను పులిబిడ్డలాగా పెంచాలనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇన్‌స్టంట్‌గా హిట్ టాక్ తెచ్చుకుంది.

బోయపాటి - బాలయ్య కాంబోలో సినిమా వస్తుందంటే మాకు పండగే అంటున్నారు నందమూరి అభిమానులు. అందులోనూ అది అఖండ2 అయితే, ప్యాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అవుతుందన్నది వారి కాన్ఫిడెన్స్.

దళపతి 69 మూవీ పూజా కార్యక్రమాలతో మొదలైంది. శుక్రవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా జరగనుంది. కీ రోల్ కోసం మమిత బైజుని సెలక్ట్ చేసుకున్నారు. హెచ్.వినోద్ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ స్క్రీన్ మీద మెప్పించిన విజయ్ - పూజా హెగ్డే ఈ సినిమా కోసం మరోసారి జోడీ కట్టనున్నారు.

దళపతి విజయ్ ప్లానింగ్ మారిపోయిందా..? ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే రాజకీయాల్లోకి బిజీ అవుతాడని అభిమానులు అనుకున్నా.. ఉన్నట్లుండి తన ప్లానింగ్ మార్చేసుకున్నారా..?