Siddhu Jonnalagadda – Tillu Square: టిల్లు గాడు ఏం పాపం చేసాడో.. పాపం సిద్ధూ సినిమా మళ్లీ వాయిదా.!

| Edited By: Anil kumar poka

Jan 05, 2024 | 9:37 PM

భలే ఉంది ఇది.. హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ను చంపేసినట్లే నామీద పడతారేంటి అంటూ అత్తారింటికి దారేదిలో ఓ డైలాగ్ ఉంటుంది గుర్తుంది కదా..? ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాకు ఇది బాగా సూట్ అవుతుంది. సంక్రాంతి సినిమాల ఎఫెక్ట్ అటూ ఇటూ తిరిగి డిజే టిల్లుపై పడింది. ఈ చిత్ర సీక్వెల్ అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మహేష్ బాబు కోసం సిద్ధూ జొన్నలగడ్డ సినిమాను త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

1 / 9
భలే ఉంది ఇది.. హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ను చంపేసినట్లే నామీద పడతారేంటి అంటూ అత్తారింటికి దారేదిలో ఓ డైలాగ్ ఉంటుంది గుర్తుంది కదా..? ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాకు ఇది బాగా సూట్ అవుతుంది. సంక్రాంతి సినిమాల ఎఫెక్ట్ అటూ ఇటూ తిరిగి డిజే టిల్లుపై పడింది.

2 / 9
ఈ చిత్ర సీక్వెల్ అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మహేష్ బాబు కోసం సిద్ధూ జొన్నలగడ్డ సినిమాను త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫిబ్రవరి 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనుకున్న తేదీకి రావడం కష్టమే అని తేలిపోయిందిప్పుడు.

3 / 9
తన సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిందని తెలిసిన తర్వాత సిద్ధూ కూడా షాక్ అవ్వక తప్పదు. అంత విచిత్రమైన పరిస్థితుల్లో తన రిలీజ్ డేట్ త్యాగం చేస్తున్నాడు ఈ హీరో. అదేంటి భయ్యా నేనెక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నారు.. నన్ను సోలోగా ఉండనివ్వరా ఏంటి అని నిర్మాతలను అడుగతాడేమో.?

4 / 9
అరే.! ఆగస్ట్‌లో సినిమాలెక్కువున్నాయి.. చిరంజీవి, రజినీ లాంటి పెద్దోళ్లతో మనకెందుకులే అని సైడ్ అయిపోయాడు సిద్ధూ.. ఆ తర్వాత కూడా సెప్టెంబర్‌లో అనుకున్నా అప్పుడు కూడా వద్దులే అని పక్కకు వెళ్లిపోయాడు. కానీ ఇప్పుడు అనౌన్స్ చేసిన కొత్త డేట్ కూడా కన్ఫ్యూజన్‌లో పడేసరికి పాపం ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ హీరోకు.

5 / 9
ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అంటారు కదా.. డిజే టిల్లుతో సిద్దూ జొన్నలగడ్డ ఇదే అయ్యాడు. అప్పుడెప్పుడో ఆరెంజ్ సినిమాలోనే నటించినా.. ఆ తర్వాత పదేళ్లు ఇండస్ట్రీలో కష్టపడినా రాని గుర్తింపు డిజే టిల్లుతో వచ్చింది ఈ కుర్రాడికి. దెబ్బకు కొడితే కుంభస్థలమే అన్నట్లు బాక్సాఫీస్ దుమ్ము దులిపేసారు టిల్లు భాయ్.

6 / 9
కామెడీ మూవీస్‌కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది డిజే టిల్లు.. మీమర్స్ అయితే సిద్ధూ జొన్నలగడ్డ డైలాగ్స్‌ను తెగ వాడేస్తున్నారు. డిజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్‌కు కథ, స్క్రీన్ ప్లే సిద్ధూనే అందిస్తున్నారు. ముందు ఈ సినిమాను 2023 ఆగస్ట్ 11న విడుదల చేయాలనుకున్నారు.

7 / 9
అయితే అదే రోజు చిరంజీవి భోళా శంకర్.. దానికి ముందు రోజు జైలర్ రావడంతో వద్దులే అని పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఆ తర్వాత సైలెంట్‌గా సెప్టెంబర్ 15కి వెళ్లాడు టిల్లు భాయ్. సెప్టెంబర్ 15న సోలోగా వచ్చి కుమ్మేద్దాం అని ప్లాన్ చేసుకుంటే.. అదే రోజు విశాల్ మార్క్ ఆంటోనీతో పాటు మరో సినిమా కూడా వచ్చింది.

8 / 9
అబ్బా ఈ రచ్చ అంతా ఏంట్రా నాయనా.. నాకు 2023 వద్దు.. హాయిగా 2024 ఫిబ్రవరి 9న వచ్చేస్తానంటూ ఏకంగా నాలుగు నెలలు పోస్ట్ పోన్ చేసాడు. అయితే ఇప్పుడు ఈ డేట్‌పై కూడా కన్ఫ్యూజన్ మొదలైంది. సంక్రాంతికి గుంటూరు కారం సినిమా కోసం సపోర్ట్ చేసిన ఈగల్ కోసం టిల్లు స్క్వేర్ సాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

9 / 9
గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ నిర్మాత నాగవంశీ కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్ రాజు చెప్పాడు. ఈగల్ సోలో డేట్ ఇప్పించాలి కాబట్టి డిజే టిల్లు సీక్వెల్‌ను వాయిదా వేయడానికి నిర్మాత ఒప్పుకున్నట్లు తెలిపాడు రాజు. ఈ లెక్కన టిల్లు భాయ్ ముందుకొస్తాడా లేదంటే ఇంకా వెనక్కి వెళ్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.