పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్'తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది సంయుక్త మీనన్.
ఈ సినిమాలో రానా దగ్గుబాటి సరసన కథానాయికగా నటించింది సంయుక్త మీనన్. అందానికి అందం నటప్రతిభ ఉన్న నాయికగా పేరు తెచ్చుకుంది ఈ వయ్యారి భామ.
ప్రస్తుతం ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.
2022లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ 'కడువ'తో బ్లాక్ బస్టర్ ని అందుకుంది.
ఇప్పుడు ధనుష్ ద్విభాషా చిత్రం వాతి (SIR).. కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా మూవీ 'బింబిసార'.. కన్నడలో గాలిపాట 2 చిత్రాల్లో నటిస్తోంది.
2016లో పాప్ కార్న్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన సంయుక్త సూపర్ హిట్ చిత్రం 'తీవండి'లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.