పద్మశ్రీ పొందిన తొలి తెలుగు కమెడియన్.. నవ్వుల వెనుక దాగిన దయాహృదయం

Updated on: May 29, 2026 | 7:29 PM

తెలుగు చిత్రసీమలో హాస్య సామ్రాజ్యానికి అప్రతిహత మహారాజు రేలంగి వెంకట్రామయ్య. హాస్యనటుల్లో తొలిసారిగా ప్రతిష్టాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని అందుకున్న ఈ మహానటుడి అరుదైన జీవిత ప్రయాణం, ఆయన చేసిన గుప్తదానాలు మరియు చివరి క్షణాల గురించిన ఆసక్తికర విశేషాలు ఈ కథనంలో మీకోసం.

1 / 5
 తెలుగు సినీ చరిత్రలో స్వర్ణయుగం గురించి మాట్లాడుకుంటే మనకు ముందుగా గుర్తుకువచ్చే పేర్లలో రేలంగి వెంకట్రామయ్య గారు ఒకరు. ఒకప్పుడు సినిమాలో హీరో ఎవరన్నది పక్కనపెట్టి, కేవలం రేలంగి గారి కామెడీ కోసమే థియేటర్లకు క్యూ కట్టిన ప్రేక్షకులు ఉన్నారంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. హాస్యాన్ని కేవలం ఒక విభాగంగా కాకుండా, దానికి సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని తెచ్చిపెట్టిన ఘనత ఆయనదే. తన విలక్షణమైన ముఖ కవళికలతో, అద్భుతమైన టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన అరుదైన కళాకారుడు ఆయన.

2 / 5
రేలంగి గారి సినీ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం మద్రాసు వీధుల్లో మైళ్ల కొద్దీ నడిచారు. ఆ తర్వాత స్టార్ నటుడిగా ఎదిగి, విలాసవంతమైన కార్లు కొన్నా కూడా ఆయన తన గతాన్ని ఎన్నడూ మర్చిపోలేదు. తాను తొలినాళ్లలో వాడిన సైకిల్‌ను ప్రాణంలా చూసుకునేవారు. "నాకు ఒకవేళ అవకాశాలు తగ్గితే, ఈ ఆస్తిపాస్తులన్నీ వదిలేసి మళ్లీ నా సైకిల్ వేసుకుని మా తాడేపల్లిగూడెం వెళ్ళిపోతాను" అని ఆయన ఎంతో వినమ్రంగా, సరదాగా అనేవారు.

3 / 5
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజం. షూటింగ్ ముగిశాక చిన్న చిన్న ఆర్టిస్టులను, అసిస్టెంట్ డైరెక్టర్లను తన సొంత కారులో ఎక్కించుకుని వారి ఇళ్ల వద్ద దించి వెళ్లేంతటి గొప్ప మనసు ఆయనది.ఆయన కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఎందరికో నవ్వులు పంచారు. రేలంగి గారి ఇంట్లో నిత్యం కనీసం 25 మందికి పైగా ఆకలి తీరేది. ఎంతోమంది పేద విద్యార్థుల ఫీజులు కట్టడం, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం వంటి ఎన్నో గుప్తదానాలు ఆయన చేశారు.

4 / 5
అప్పట్లో సూర్యకాంతం-రేలంగి కాంబినేషన్ అంటే వెండితెరపై ఒక పెద్ద బ్రాండ్ ఇమేజ్. సావిత్రి గారిలా దానాలు చేసినా, ఆమెలా ఎలాంటి దురలవాట్లకు లోనుకాకుండా నిండుకుండలా జీవించారు. తన 34 ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 205 చిత్రాల్లో నటించిన రేలంగి గారు, ఒక వేదికపై "ఇన్నేళ్లుగా నటిస్తున్నా ప్రభుత్వం నన్ను గుర్తించలేదు" అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు అప్పటి హోం మంత్రి జలగం వెంగళరావు గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో, 1970లో ఆయనను 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరవించింది. భారత చలనచిత్ర రంగంలో ఒక హాస్యనటుడికి ఈ పురస్కారం దక్కడం అదే తొలిసారి.

5 / 5
1975 నవంబర్ 27న ఆయన కన్నుమూశారు. మరణించే కొన్ని క్షణాల ముందు తనను కింద పడుకోబెట్టమని కోరి, ఆ క్షణంలోనే ప్రాణాలు విడిచారు. తన మరణాన్ని తానే ఊహించిన మృత్యుంజయ నటుడు ఆయన. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన పంచిన నవ్వులు, చూపిన మానవత్వం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటాయి.

Follow Us