
బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ అందరికీ సుపరిచితమే. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ ద్వారా ఈ అమ్మడు యూత్‌ను ఆకట్టుకుంది. హోలీ మూవీ ద్వారా తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత కరెంట్, గుంటూరు టాకీస్, నువ్వే నువ్వే లాంటి పలు సినిమాల్లో నటించింది.

తర్వాత జబర్దస్త్‌లోకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి తన వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా తన గ్లామర్‌తో కుర్రకారును అట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక రష్మీ అంటే సుధీర్ ఈ జోడీ అంటే చాలా మందికి ఇష్టం. వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ ఆ మధ్య చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఇవన్నీ సెట్స్ వరకే, మేము మంచి స్నేహితులం అంటూ చాలా మంది చెప్పుకొచ్చారు. అయినా రూమర్స్‌కు ఎండ్ కార్డ్ మాత్రం పడటం లేదు. వీరిద్దరూ జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకొని, సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టి పలు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు.

ఇక ప్రస్తుతం రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, పలు షోలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య వరస ఫొటో షూట్‌తో కుర్రకారుకు అందాల బాణాలు విసురుతుంది. తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

రెడ్ శారీ కట్టుకొని, సింపుల్ లుక్‌లో చూడటానికి చాలా అందంగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.