Tollywood : జయం సినిమాను మిస్ అయ్యింది.. లేదంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యేది.. యాంకరమ్మ బ్యాడ్ లక్..

Updated on: May 25, 2026 | 3:14 PM

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాల్లో జయం ఒకటి. డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకుంది ఓ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఆమె బుల్లితెరపై క్రేజీ యాంకర్. ఇంతకీ ఎవరంటే..

1 / 5
టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నితిన్, సదా జంటగా నటించిన చిత్రం ‘జయం’. 2002లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో, అప్పట్లో యువతను ఏ రేంజ్ లో ఊపేసిందో అందరికీ తెలిసిందే. ‘వెళ్ళవయ్యా వెళ్ళిపో’ అంటూ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సదా రాత్రికి రాత్రే స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. అయితే, ఈ ఐకానిక్ పాత్రకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన నిజం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

2 / 5
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మొదట సదాను కాకుండా టాలీవుడ్ టాప్ యాంకర్, నటి రష్మి గౌతమ్ ను అనుకున్నారట. దర్శకుడు తేజ ‘జయం’ సినిమా కోసం సరికొత్త ముఖాలను వెతుకుతున్న సమయంలో రష్మి గౌతమ్‌ను చూసి హీరోయిన్ పాత్రకు ఎంపిక చేయాలని భావించారు. అప్పటికే రష్మి లుక్స్ , స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాయని టీమ్ భావించింది. అయితే, కొన్ని అనివార్య కారణాలు , డేట్స్ కుదరకపోవడం వల్ల రష్మి ఈ గోల్డెన్ ఛాన్స్‌ను ముందడుగు వేసి అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఆ పాత్ర సదా చెంతకు చేరడం, సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం జరిగిపోయాయి.

3 / 5
 ఒకవేళ రష్మి కనుక ‘జయం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఉంటే, ఆమె కెరీర్ గ్రాఫ్ ఇండస్ట్రీలో మరోలా ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ ఆఫర్ చేజారినప్పటికీ, రష్మి గౌతమ్ నిరాశ పడకుండా ఇండస్ట్రీలో తన ప్రయత్నాలను కొనసాగించింది. ఉదయ్ కిరణ్ నటించిన ‘హోలీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన రష్మి.. ఆ తర్వాత ‘కరెంట్’, ‘ఎవరైనా ఎపుడైనా’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది. కానీ, రష్మి జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం బుల్లితెరే.

4 / 5
‘జబర్దస్త్’ (Jabardasth) కామెడీ షో ద్వారా యాంకర్‌గా రష్మి తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన గ్లామర్, యాంకరింగ్ స్టైల్‌తో బుల్లితెర క్వీన్‌గా ఎదిగింది. ఆ పాపులారిటీతోనే ‘గుంటూర్ టాకీస్’ సినిమాతో హీరోయిన్‌గా సాలిడ్ హిట్ కొట్టి తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం అటు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా రాణిస్తూనే, ఇటు వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో రష్మి దూసుకుపోతోంది. ఈ పాత లీక్ ఇప్పుడు బయటకు రావడంతో "రష్మి ‘జయం’ మిస్ చేసుకోవడం నిజంగా బ్యాడ్ లక్" అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

5 / 5
రష్మీ గౌతమ్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (వైజాగ్)లో జన్మించారు. ఆమె తల్లి ఒడిశాకు చెందినవారు కాగా, తండ్రి ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. చిన్నతనం నుంచే నటనపై ఉన్న మక్కువతో చదువు పూర్తయిన తర్వాత గ్లామర్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టారు. రష్మీ 2002లో ఉదయ్ కిరణ్ నటించిన 'హోలీ' సినిమాతో ఒక చిన్న పాత్ర ద్వారా టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. ఆ తర్వాత 'కరెంట్', 'ఎవరైనా ఎపుడైనా', 'బిందాస్' వంటి చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ (సహాయక పాత్రలు) చేశారు. 2016లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన 'గుంటూర్ టాకీస్' సినిమా రష్మీ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచింది.

Follow Us