
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రౌడీ జనార్ధన'. ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక అదిరిపోయే అప్‌డేట్ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన మాస్ మసాలా స్పెషల్ సాంగ్ ఉండనుందట.

అయితే ఈ పాట కోసం కన్నప్ప సినిమా ఫేమ్, యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ ను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ పాట కోసం దర్శకుడు రవి కిరణ్ కోలా ఒక అదిరిపోయే మాస్ సిచువేషన్‌ను డిజైన్ చేశారని టాక్.. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు వరించినట్లు సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమెతో చర్చలు ముగింపు దశకు వచ్చాయని, అంతా అనుకూలిస్తే థియేటర్లలో విజయ్, ప్రీతిల మాస్ డ్యాన్స్ మూవ్స్ , కెమిస్ట్రీ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు.. ఈ పాటతో పాటు సినిమాలో ఆమె ఒక చిన్న కీలక పాత్రలో కూడా మెరవనుందని జోరుగా ప్రచారం నడుస్తోంది.

'రౌడీ జనార్ధన' కథాంశం పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో పవర్‌ఫుల్ పీరియాడిక్ డ్రామాగా సాగనుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సినిమా మొత్తానికే మేజర్ హైలైట్‌గా నిలవనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ ప్లాష్ బ్యాక్ సీన్స్‌లో విజయ్ దేవరకొండ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత రగ్గడ్, వైల్డ్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తాడని.. అలాగే ఇందులో వచ్చే హై-వోల్టేజ్ స్టంట్ సీక్వెన్స్ మాస్ ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయని మేకర్స్ ఎంతో ధీమాగా ఉన్నారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ (Title Glimpse)కు సోషల్ మీడియాలో ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్, సీనియర్ హీరో రాజశేఖర్ ఒక అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ క్యారెక్టర్ డిజైన్, ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఎంతో వైవిధ్యంగా, పవర్‌ఫుల్ విలనిజం లేదా నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని ఇండస్ట్రీ టాక్.

క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాన్-ఇండియా లెవెల్లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం ఒకవైపు 'రణబాలి' సినిమా చేస్తూనే, మరోవైపు ఈ 'రౌడీ జనార్ధన' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని విజయ్ దేవరకొండ పూర్తి కసితో ఉన్నాడు. ఈ చిత్రంతో ప్రీతి ముకుందన్ మరోసారి తెలుగులో పాపులర్ కానుందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.