
డాకు మహారాజ్ మూవీతో సక్సెస్ అందుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ నటించిన మిర్చిలాంటి కుర్రోడు సినిమాతో తెలుగు వెండితెరపై అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ అమ్మడుకు అంత ఫేమ్ రాలేదు.

కానీ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ సరసన కంచె మూవీలో నటించి తన అందం, నటనతో కుర్రకారును ఫిదా చేసింది ఈ బ్యూటీ. ఈ మూవీతో ప్రగ్యా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడుకు అవకాశాలు క్యూ కట్టాయి.

కంచె మూవీ తర్వాత జయ జానకీ నాయక, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, ఆచారి అమెరికా యాత్ర వంటి చాలా సినిమాల్లో నటించింది. కానీ ఈ సినిమాలు అంతగా హిట్ అందుకోకపోవడంతో, ఈ బ్యూటీకి కూడా ఫేమ్ రాలేదు.

ఇక సినిమా అవకాశాలు రావేమో అనుకునే సమయంలో అదృష్టం తలుపు తట్టింది. బాలయ్య అఖండ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ తర్వాత డాకు మహారాజ్ ఇలా వరస బ్లాక్ బస్టర్స్ తో మంచి జోష్ లో ఉంది.

ఈ మధ్య ప్రగ్యా జైస్వాల్ తన వరస ఫొటో షూట్ తో యూత్ ను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గోల్డె కలర్ లెహంగాలో తన అందాలను ఆరబోస్తూ అచ్చం దేవకన్యలా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.