యానిమల్ వచ్చి చూస్తుండగానే 5 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు స్పిరిట్ గురించి పెద్దగా ఏ అప్‌డేట్ ఇవ్వలేదు సందీప్ వంగా. అసలు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందా..? అయితే ఎంతవరకు వచ్చింది..? అనుకున్నట్లుగానే సందీప్ రెడ్డి వంగా నెక్ట్స్ సినిమా ప్రభాస్‌తోనే ఉండబోతుందా.? ఉంటే స్పిరిట్ అప్‌డేట్స్ ఏంటి..? ఎప్పట్నుంచి మొదలు కాబోతుంది.? ఎంతసేపూ అయితే కల్కి.. లేదంటే రాజా సాబ్ అంటూ రెండు సినిమాల గురించే అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి.