Prabhas – Salaar: తెలుగు స్టేట్స్ లో డార్లింగ్ నయా రికార్డ్స్.! ప్రభాస్ ఈజ్ బ్యాక్.
2024లో ప్రభాస్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? ఒప్పుకున్న సినిమాల్లో ముందు దేన్ని పూర్తి చేయబోతున్నారు..? సలార్ 2 రేసులో ముందుకొస్తుందా లేదంటే నాగ్ అశ్విన్ సినిమాకు డేట్స్ ఇచ్చేస్తారా..? ఎప్పట్నుంచో లైన్‌లో ఉన్న మారుతి సినిమాను ఖతమ్ చేస్తారా..? అదీ కాదంటే స్పిరిట్ అంటూ సందీప్‌ను రేసులోకి తెస్తారా..? అసలు ప్రభాస్ ప్లాన్ ఏంటి..?చాలా కాలం తర్వాత ప్రభాస్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు. దానికి కారణం సలార్.. దానికి వస్తున్న వసూళ్లు. విడుదలైన 11వ రోజు కూడా ఏపీ తెలంగాణలో 8.30 కోట్ల షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది సలార్.