
దీంతో తెలుగు, కన్నడ,తమిళ, హిందీలో వరసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఒకప్పుడు ఈ అమ్మడు మరో సినిమా సైన్ చేయడానికి డేట్సే కుదరకపోయేవి కానీ ఇప్పుడు ఆఫర్స్ లేక చాలా ఖాళీగా ఉంటుందంట ఈ ముద్దుగుమ్మ. చాలా రోజులుగా టాలీవుడ్‌కు దూరమైంది ఈ అమ్మడు.

చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో పూజాకు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటే ఈ బుట్టబొమ్మ వరస ఫొటో షూట్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

తాజాగా ఈ చిన్నది చీరకట్టులో అందరినీ ఆకట్టుకుంది. సరికొత్తగా చీర కట్టుతో కుర్రకారు మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.

స్ట్రాప్ లెస్ బ్లౌజ్ ధరించి, లైట్ పింక్ కలర్ శారీలో, చాలా అమాయకంగా చూస్తూ.. హ్యాప్పీ వాలెంటైన్స్ డే అంటూ ఫొటోలు షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో చీరలో ఫ్యాషన్ ఐకానిక్‌గా మారిపోయావు అంటూ పలవురు కామెంట్స్ చేస్తున్నారు. మరీ మీరు ఈ ఫోటోస్ పై ఓ లుక్ వేయండి.