
సలార్ సక్సెస్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా ఫుల్ కిక్కించింది. అందుకే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న డార్లింగ్ సినిమాల విషయంలోనూ కదలిక కనిపిస్తోంది.

ఒక్క అఫీషియల్ అప్‌డేట్ కూడా లేకుండానే షూటింగ్ కానిచ్చేస్తున్న ఓ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

సలార్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు డార్లింగ్ ప్రభాస్. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా ఆల్రెడీ 500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు అదర్ లాంగ్వేజెస్‌లోనూ సత్తా చాటింది.

ఈ సక్సెస్, లైన్‌లో ఉన్న డార్లింగ్ సినిమాల విషయంలోనూ కదలిక తీసుకువచ్చింది. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న కల్కి 2898 ఏడి ప్రమోషన్స్ స్పీడు పెంచారు మేకర్స్. బాంబే లోని ఐఐటీలో కల్కికి సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మారుతి సినిమాకు సంబంధించి అప్‌డేట్ కూడా వచ్చేసింది. చాలా రోజులుగా షూటింగ్ జరుగుతున్నా ఈ సినిమాకు సంబంధించి ఒక్క అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వలేదు యూనిట్.

కనీసం ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి రెడీ అవుతుందన్న అప్‌డేట్ కూడా ఇవ్వలేదు,. ఇప్పుడు సడన్‌గా సంక్రాంతికి ఫస్ట్ లుక్ అంటూ ఎనౌన్స్ చేయటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రీసెంట్‌గా స్పిరిట్ సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చింది టీ సిరీస్ టీమ్.

మే నెలలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుందని, 2024లో సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇలా వరుస అప్‌డేట్స్‌కు సలార్ సక్సెసే కారణం అంటున్నారు విశ్లేషకులు.