
బాలీవుడ్ బ్యూటీ అందాల తారా, మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ టెలివిజన్, సీరియల్స్ ద్వారా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది, నాగీన్ సీయల్ ద్వారా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది.

ఇక ఈ సీరియల్ తెలుగులో నాగినీగా టెలికాస్ట్ అయ్యింది. దీంతో ఈ సీరియల్‌లో తెలుగు బుల్లితెర అభిమానుల ఫేవరెట్ అయిపోయింది. నాగిని సీరియల్‌లో ఈ చిన్నది తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఆ సమయంలో ఈ చిన్నది యువకుల డ్రీమ్ గర్ల్ అయిపోయింది.

సీరియల్ ఫేమ్ ద్వారా ఏకంగా వెండితెరపై అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగు, హిందీలో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. అంతే కాకుండా స్పెషల్ సాగ్స్ ద్వారా కూడా యాత్‌ను అట్రాక్ట్ చేస్తుంది.

నటిగా, స్పెషల్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ చిన్నది , ఏకంగా చిరు సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. చిరంజీవి విశ్వంభర సినిమాలో ఈ ముద్దుగుమ్మ స్పెల్ సాంగ్ చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా హిందీలో పలు సినిమాల్లో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

ఇక ఓ వైపు సినిమాలు, మరో వైపు స్పెషల్ సాంగ్స్‌తో ఫుల్ బిజీగా ఉండే ఈ చిన్నది, ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది చీరలో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.