అక్కినేని నాగార్జున నటవారసుడిగా జోష్ సినిమాతో సినీపరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టాడు నాగచైతన్య. ఈ సినిమా విజయాన్ని అందుకోకపోయినా.. నటనపరంగా ప్రశంసలు అందుకున్నాడు చైతూ. ఆ తర్వాత ఏమాయ చేసావే సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు ఈ అక్కినేని హీరో. ఈ సినిమా తర్వాత వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు చైతూ.