Movies: వయోలెన్స్‌ నాట్ అవాయిడ్ మీ అంటున్న హీరోలు.. ఇదే నయా ట్రెండ్..

| Edited By: TV9 Telugu

Feb 05, 2024 | 4:03 PM

హీరోలు ఎంత వైలెంట్‌గా ఉంటే హిట్టు కూడా అంటే వైలెంట్‌గా ఉంటుంది..! ఏంటి నమ్మరా..? సాక్ష్యాలు చూపించి మరీ మిమ్మల్ని నమ్మించే బాధ్యత మాది. ఈ మధ్య కాలంలో హీరో ఎంత ఎక్కువ మారణ హోమం సృష్టిస్తే అంత పెద్ద విజయం సాధిస్తున్నాయి సినిమాలు. ఇండస్ట్రీలో ఇదే జరుగుతుందిప్పుడు. వయోలెన్స్‌కు బాగా కనెక్ట్ అయిపోతున్నారు హీరోలు. వాళ్లను ఎంత క్రూరంగా చూపిస్తే అంత పెద్ద విజయం సాధిస్తున్నాయి సినిమాలు. మరి అలాంటి మోస్ట్ వైలెంట్ హీరోలు, సినిమాలను ఓసారి చూద్దామా..?

1 / 5

2 / 5
కావాలంటే యానిమల్ సినిమానే తీసుకోండి. అందులో నాన్నకు ప్రేమతో అంటూ రణ్‌బీర్ కపూర్ ఎన్ని వందల మందిని చంపేస్తాడో లెక్క కూడా పెట్టలేం. ఇంత వైలెంట్ మ్యాన్‌కు ఆడియన్స్ 900 కోట్లు కట్టబెట్టారు.

3 / 5
రీసెంట్‌గా మనకు కలిసిన మరో వయోలెంట్ మ్యాన్ దేవా. సలార్ సినిమాలో ప్రభాస్ కారెక్టర్ పేరు ఇది. అందులో ఆయన సృష్టించిన మారణ హోమం మామూలుగా ఉండదు. వచ్చినోడిని వచ్చినట్లు నరికేస్తుంటారు ప్రభాస్. సినిమా కూడా మాస్‌కు అలాగే ఎక్కేసింది. అందుకే 700 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక విక్రమ్‌లో రోలెక్స్ కారెక్టర్ కూడా అంతే.. ఆ క్రూరత్వాన్ని మాటల్లో చెప్పడం కూడా కష్టమే.

4 / 5
కేజియఫ్ రెండు పార్ట్స్‌లో యశ్‌ను వైలెంట్ మ్యాన్‌గానే చూపించారు ప్రశాంత్ నీల్. పైగా వయోలెన్స్‌ను నేను అవాయిడ్ చేసినా.. అది నన్ను అవాయిడ్ చేయదంటూ డైలాగ్స్ చెప్పించారు. ఫలితంగా 2 పార్ట్స్ కలిపి 1500 కోట్లకు పైగానే వసూలు చేసింది. 

5 / 5
అఖండలో బాలయ్య కారెక్టర్ కూడా ఇలాగే ఉంటుంది. ఇందులో అగోరాగా గూస్ బంప్స్ తెప్పించారు. అర్జున్ రెడ్డిలో మారణ హోమం లేకపోయినా.. వైలెంట్‌గానే కనిపిస్తుంటారు విజయ్ దేవరకొండ.