
మట్కా ట్రైలర్ చూశారా? మాస్‌గా ఉందని మెగాస్టార్ ప్రశంసలు అందుకున్న ట్రైలర్.. జనాలకు మెప్పించిందా?

నేనింతే.. మా పెదనాన్నని, బాబాయ్‌నీ, అన్ననీ గుర్తుచేసుకుంటాను. నేను ఎక్కడున్నా.. ఎక్కడి నుంచి వచ్చానన్న విషయాన్ని మర్చిపోను.. అటూ ఇటూగా ఇవే మాటలు చెప్పారు వరుణ్‌తేజ్.

కావాల్సినంత న్యూస్, మసలా అక్కడే దొరుకుతోందన్నది మెల్లిగా స్ప్రెడ్ అవుతోంది... ఇంతకీ మట్కా ఈవెంట్లో వరుణ్‌తేజ్ మాటలు మీరు విన్నారా.. మీకేం అర్థమైంది.?


ఆ మధ్య క, జితేందర్‌రెడ్డి ప్రీ రిలీజుల్లో హీరోలు ఆవేశపడినట్టే.. మట్కా ప్రీ రిలీజ్‌లోనూ వరుణ్ ఆవేశ పడ్డారా.? లేకుంటే, నిజంగానే ఎవరినైనా ఉద్దేశించే ఈ మాటలన్నారా.?

కరుణకుమార్ ఫ్రేమ్‌లో వరుణ్ ఎలా ఫిట్ అయ్యారు? డబ్బు వ్యసనంతో తప్పులు చేసే వాసు కేరక్టర్‌ని వరుణ్ ఎలా పండించారు.?

ఇన్ని ప్రశ్నలకు ఆన్సర్ తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే.