మక్కళ్ సెల్వన్ లేటెస్ట్ ఇంటర్వ్యూల్లో ఏం చెబుతారా? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. భాషా సరిహద్దులు దాటి ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న పెర్ఫార్మెన్స్ విజయ్ సేతుపతి సొంతం. హీరో, విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్... కేరక్టర్ ఏదైనా, సిల్వర్ స్క్రీన్ మీద రఫ్ఫాడించేస్తారు.
అంత ఇమేజ్ ఉన్న ఆయన విలన్ రోల్స్ చేయనంటూ ఆ మధ్య డిక్లేర్ చేసేశారు. అలా ఎందుకు అన్నట్టు? ఇప్పుడు రీజన్ రివీల్ చేశారు మిస్టర్ సేతుపతి.. విజయ్ సేతుపతి విలన్ రోల్స్ కి నో చెప్పడం సంగతి సరే.. అసలు హీరోగా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు విలన్ రోల్స్ కి యస్ ఎందుకు చెప్పినట్టు? దీని గురించి ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేశారు మిస్టర్ సేతుపతి.
మామూలుగా విలన్ అంటే అందరూ క్రూరంగానే ఉండాలని ఫిక్స్ అవుతారు. స్క్రీన్ మీద ఎంత మందినైనా చంపొచ్చు.. ఎంత మందినైనా అదుపులో ఉంచుకోవచ్చు... ఇలాంటివి చాలానే ఉంటాయి. ఎక్కడో మనలో ఉన్న రాక్షసుడిని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలనిపిస్తుంది.
కానీ అందుకు భిన్నంగా ఉండాలని ఆలోచించాను అన్నది సేతుపతి స్టేట్‌మెంట్. కామెడీ విలన్, మంచి ఫ్యామిలీ ఉన్నా... వాళ్లకి తెలియకుండా నెగటివ్‌గా ప్రవర్తించే విలన్.., రకరకాల ఎమోషన్స్ ఫీలయ్యే విలన్.. ఇలాంటి విలన్‌లను స్క్రీన్ మీద ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా.
అందుకే, అలాంటి పాత్రలే చేశాను. విజయ్ సేతుపతి విలనిజం పెక్యులియర్‌గా ఉంటుంది అని అందరూ అనడానికి రీజన్ అదే అని మనసులో మాట చెప్పేశారు మిస్టర్ సేతుపతి. అయితే ఇప్పుడు విజయ్ సేతుపతికి అస్సలు ఖాళీ ఉండట్లేదట.
తనకు దొరికిన తీరిక సమయంలో, హీరోగా చేయాల్సిన కథలు వినడానికే సమయం సరిపోవడం లేదట. అలాంటిది రొటీన్ విలన్ స్క్రిప్టులతో దర్శకులు అప్రోచ్ అవుతుంటే, అనవరసరంగా సమయం వృథా అవుతుందట.
ప్రస్తుతానికి విలనిజానికి గ్యాప్ ఇచ్చానని అంటున్నారు మక్కళ్ సెల్వన్. తనను ఎగ్జయిట్ చేసే స్క్రిప్ట్ వస్తే పునరాలోచిస్తానన్నది ఆయన మాట. సంక్రాంతికి రిలీజ్ అయ్యే మెరీ క్రిస్‌మస్‌లో హీరోగా నటించారు విజయ్ సేతుపతి.