
కృతి శెట్టి. ఈ చిన్నది తెలుగు, తమిళ సినిమాల్లో పని చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ 2003 సెప్టెంబరు 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది, ముంబైలో పెరిగింది. ఆమె తండ్రి కృష్ణ శెట్టి వ్యాపారవేత్త, తల్లి నీతి శెట్టి ఫ్యాషన్ డిజైనర్.

చిన్నతనం కృతి శెట్టి ఐడియా, షాపర్స్ స్టాప్, పార్లే, లైఫ్‌బాయ్ వంటి పలు బ్రాండ్‌ల వాణిజ్య ప్రకటనల్లో నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. కృతి 2019లో హిందీ చిత్రం సూపర్ 30లో చిన్న పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.

అంతకు ముందు కార్తీ హీరోగా నటించిన నా పేరు శివ సినిమాలో ఇలా కనిపించి అలా వెళ్తుందని టాక్. కానీ అది నిజం కాదు. ఇక ఇప్పుడు ఆమె హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవలే కార్తీ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా చేసింది

వాతియార్ అనే సినిమాలో కార్తీకి జోడీగా కృతిశెట్టి నటించింది. అలాగే జయం రవితో ఓ సినిమా చేస్తుంది. ఆ మధ్య ఈ సినిమా నుంచి ఓ సాంగ్ విడుదల చేశారు. ఆ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో కీర్తిసురేష్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ కవ్విస్తుంది.