బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఫిబ్రవరి 7న వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే
కొన్నేళ్లుగా ప్రేమలో ఉండిన ఈ బాలీవుడ్ జంట పెళ్లితో ఒకటయ్యారు
తాజాగా ఈ జంట ఓ అవార్డుల కార్యక్రమానికి హాజరైంది. ఈ కార్యక్రమంలో కియారా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు
ప్రేమికులుగా ఉండటం ఎంత బాగుంటుందో.. ఆ ప్రేమను పెళ్లి పీటల వరకూ తీసుకెళితే ఆ ఆనందం వేరేలా ఉంటుందన్న కియారా
పెళ్లి సమయంలో నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను. పెళ్లి మండపానికి చేరుకోగానే అక్కడ పెళ్లి పీటల మీద కూర్చొన్న సిద్ధార్థ్‌ను చూడగానే మనసంతా ఆనందంతో నిండిపోయింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఎవరికైనా ఇంతే సంతోషం ఉంటుందేమోనని అని చెప్పుకొచ్చింది నటి కియారా