Basha Shek |
Feb 13, 2023 | 8:26 PM
కేజీఎఫ్ ఫేమ్, రాకింగ్ స్టార్ యశ్ సతీమణి రాధికా పండిట్ గతంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. నిత్యం తన భర్త, పిల్లల ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకునేది.
అయితే, రాధికా పండిట్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. ఈక్రమంలో తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణాన్నిబయటపెట్టిందామె.
రాధికా పండిట్ తన బంధువుల పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. దీంతో సోషల్ మీడియాను ఫేస్ చేయలేకపోతున్నారు.
రాధిక పండిట్ చాలా రోజుల తర్వాత ఆదివారం (ఫిబ్రవరి 12) కొత్త ఫోటోను షేర్ చేసారు. తాను సరదాగా దిగిన సెల్ఫీలు పంచుకుంటూ తాను సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నానో వివరించింది.
రాధికా పండిట్ ఇటీవలి తన కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఆమె మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలని కోరుతున్నారు.