
అయితే తాజాగా ఈ అమ్మడు తన వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

కీర్తిసురేష్.. మాలోని మలయాళీలను బయటకు తీసుకొచ్చాం.. టోస్ట్ విత్ ఏ ట్విస్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చి, వివాహ వేడుక ఫొటోలను పంచుకోగా, ఆ ఫోటోస్‌లో కీర్తి, ఆంటోనీ అదిరిపోయారనే చెప్పవచ్చు.

ఇక వీరు తమ సంగీత్ నైట్‌లో డ్యాన్స్ చేస్తూ ఉన్న ఫొటోస్ అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో వీరు చాలా సంతోషంగా జోష్‌ఫుల్‌గా కనిపస్తున్నారు.

అంతే కాకుండా వీరు తమ కుటుంబసభ్యులతో కలిసి చాలా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తుంది. బాణసంచా కాల్చుతూ, వారు డ్యాన్స్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.

ఇక కీర్తి సురేష్ తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ చిత్రంలో కనిపించింది. ఈ మూవీ విడుదలై అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు కానీ, కీర్తికి మాత్రం మంచి క్రేజ్ వచ్చిందనే చెప్పాలి.