
సౌత్ ఇండస్ట్రీలోటాప్ హీరోయిన్‌గా చెలామణి అవుతున్న కీర్తి సురేష్.. తన నటన, అందంతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది.

నేను లోకల్ లాంటి కమర్షియల్ మూవీతో పాటు 'మహానటి' లాంటి హిస్టారికల్ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి.

ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట, చిరంజీవి భోళా శంకర్ చిత్రాలలో నటిస్తుంది.

అతి తక్కువ సమయంలో ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్న అభినవ సావిత్రి కీర్తిసురేష్..

1992లో అక్టోబర్ 17న సురేష్, మేనక దంపతలకు జన్మించింది

కీర్తి సురేశ్ ఓ నాటి అందాల నాయిక మేనక కూతురు. మేనక అప్పట్లో చిరంజీవి ‘పున్నమినాగు’లో నాయికగా నటించారు.

కీర్తి సురేశ్ తండ్రి సురేశ్ కుమార్ మళయాళ చిత్ర దర్శకుడు.

ఈ అమ్మడు ఇప్పటి దాకా ఏడాదికి ఒకటి లేదంటే రెండు సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది.

తమిళ, హిందీ సినిమాలతో కూడా బిజీగా మారిపోయింది కీర్తి సురేష్. సినిమాకు దాదాపు కోటి నుంచి కోటిన్నర వరకు పారితోషికం అందుకుంటుంది కీర్తి.

ఈ రోజు కీర్తి బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట , భోళా శంకర్ చిత్రాలలో కీర్తి లుక్‌కి సంబంధించి పోస్టర్ విడుదల చేశారు.