
నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. జాన్వికి స్ట్రాంగ్ ఫిలిం బ్యాగ్రౌండ్ ఉన్న విషయం తెలిసిందే.. ఈ అందాల ప్రముఖ దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ల పెద్ద కుమార్తె. అయినప్పటికీ నటిగా తనను తాను నిరూపించుకుంటుంది. ఈ క్రమంలోఈ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించింది.

జాన్వీ కపూర్ 2018లో వచ్చిన ధడక్ అనే హిందీ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఇది మరాఠీ బ్లాక్‌బస్టర్ సినిమా 'సైరాట్'కు రీమేక్. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఆమె 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్', 'రూహీ', 'మిలీ', 'బవాల్', 'మిస్టర్ అండ్ మిసెస్ మాహి' వంటి విభిన్నమైన పాత్రలు ఉన్న సినిమాల్లో నటించి మెప్పించింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనదైన గుర్తింపు తెచ్చుకుంది.

జాన్వీ కపూర్‌కు తన తల్లి శ్రీదేవి లాగే సౌత్ సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఎప్పుడూ ఉండేది. ప్రస్తుతం ఆమె తెలుగు చిత్రసీమలో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈ చిన్నది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాతో ఆమె టాలీవుడ్‌లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో.. మహేష్ బాబు గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు చాలా అందంగాడు. ఆయనకు అసలు వయసు పెరుగుతుందా అని అనిపిస్తుంది. ఎప్పుడూ యంగ్ గా కనిపిస్తుంటారు. ఆయన నాకన్నా యంగ్ గా కనిపిస్తుంటారు అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇక జాన్వీ కపూర్ కేవలం సినిమాల పరంగానే కాకుండా, సోషల్ మీడియాలో తన ఫ్యాషన్ సెన్స్, గ్లామరస్ ఫోటోషూట్స్ అలాగే ఫిట్‌నెస్ వీడియోలతో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. రెగ్యులర్ గా ఫోటో షూట్ లతో అదరగొడుతుంది జాన్వికపూర్.