
జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పటాస్ ప్రవీణ్ పేరుతో అతను చేసే స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. అలాగే యూట్యూబ్ లోనూ భారీ వ్యూస్ వస్తుంటాయి.

పటాస్ తో కెరీర్ ప్రారంభించిన ప్రవీణ్ జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో పాటు జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర టీవీషోల్లోనూ సందడి చేస్తున్నాడు ట్యాలెంటెడ్ యాక్టర్. అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తున్నాడు ప్రవీణ్.

టీవీ షోల సంగతి పక్కన పెడితే.. ప్రవీణ్ ఇటీవల ప్రముఖ డ్యాన్సర్ కడెం వంశితతో కలిసి పెళ్లిపీటలెక్కాడు. సింపుల్ గా ఓ గుడిలో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, జబర్దస్త్ కమెడియన్లు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.

పెళ్లి తంతు పూర్తి కావడంతో మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్ పై దృష్టి సారించారు ప్రవీణ్, వంశిత. తాజాగా వీరిద్దరు ఓ షోకు హాజరు అయ్యారు. దీంతో స్టేజీపైనే మరోసారి వీరిద్దరికి పెళ్లి చేశారు. పూల దండలు మార్పించారు.

జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, పొట్టి నరేష్, యాంకర్ రష్మీ, రాజీవ్ కనకాల తదితరులు కొత్త జంటతో కలిసి సరదాగా ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త దంపతులకు మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.