
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో రచ్చ రవి కూడా ఒకరు.తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ నటుడు తన డిఫరెంట్ స్లాంగ్, యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టీవీ షోలతో పాటు వరుసగా సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడీ స్టార్ కమెడియన్.

గతేడాది ఏకంగా ఐదు సినిమాల్లో నటించాడు రచ్చ రవి. ఈ ఏడాదిలో ఇప్పటికే అతను నటించిన మూడు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. వనవీర, మృత్యుంజయ్ రీసెంట్ గా సింగ్ గీతం సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు రచ్చ రవి. ప్రస్తుతం నటుడి చేతిలో పలు సినిమాలున్నాయి.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు రచ్చ రవి. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంటుంటాడు. అలాగే అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటాడు,

అలా తాజాగా తన భార్యను పుట్టినరోజును పురస్కరించుకుని ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు రవి. తన సతీమణితో కలిసి గతంలో వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలను షేర్ చేసిన రవి ఒక ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చాడు.

'నాకే అర్థం కాని నా జీవితంలోకి నువ్వు వచ్చి నలుగురు చేత కాదు కాదు ఈ ప్రపంచం చేత రవిది అర్థవంతమైన జీవితం అనేదాకా... ప్రపంచానికి కనపడే నన్ను భరిస్తూ పూర్తిగా అర్థం చేసుకున్నఅర్ధాంగి కాదు.. కాదు... నా స్వాతిముత్యం...'

'నా జీవన ప్రయాణానికి స్వాతి కిరణం.. నా ఆశల ప్రపంచానికి స్వాతి చినుకు ... నా నిండు హృదయంతో మనసు పూర్తిగా స్వాతి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని భార్యపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చాడు రచ్చ రవి. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.