
యంగ్ సెలబ్రిటీ పిల్లలు తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని బాలీవుడ్‌లో ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. సారా టెండూల్క పరిచయం అక్కర్లేని పేరు. అత్యంత పాపులర్ సెలబ్రిటీ కిడ్. రాబోయే స్టార్ కిడ్స్ యాక్టర్స్ జాబితాలో సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ చేరనుందని టాక్ మళ్ళీ వినిపిస్తోంది.

1997 అక్టోబర్ 12న జన్మించింది ..సారా.. లండన్ యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేసింది. సచిన్, అంజలీ కూడా ఆమె నిర్ణయానికి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది

ఒక వార్తా పోర్టల్‌పై నివేదికప్రకారం సచిన్ కుమార్తె సారా తన పెద్ద బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. సారాకు నటన అంటే ఆసక్తి. సినిమాలంటే తెగ ఇష్టపడే సారా ఇక్కడికే యాక్టింగ్ లో శిక్షణ కూడా తీసుకుంది. కొన్ని బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌కు ప్రచారకర్తగానూ వ్యవహరిస్తోంది.

కొన్నేళ్ల క్రితమే బాలీవుడ్ స్టార్ షాహిద్ సరసన సారా అరంగేట్రం చేయనుందనే వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లేనని అప్పుడు సచిన్ స్పష్టంచేశారు. ఇప్పుడు మళ్లీ ఈ ప్రచారం తెరపైకి వచ్చింది. ఆమె వెండితెర అరంగేట్రానికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి

ఈ ముద్దుగుమ్మ ఎక్కడ కనిపించినా వెంటనే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. సారా టెండూల్కర్ సోషల్ మీడియాలోనూ పాపులర్.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 1.8 మిలియన్ల మంది ఈ బ్యూటీని అనుసరిస్తున్నారు.