
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరో. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

ఈమూవీలో ఊర మాస్ లుక్ లో బన్నీ స్టైల్..డైలాగ్స్.. యాక్టింగ్ చూసి అడియన్స్ ఆశ్చర్యపోయారు. 2021 డిసెంబర్‌లో విడుదలైన ‘పుష్ప’ సినిమా బన్నీ కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని సాధించింది.

ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. పుష్ప తర్వాత ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు.

ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. పుష్ప 2 షూటింగ్ చాలా నెమ్మదిగా సాగుతోంది.

ఇంకా షూటింగ్ జరుపుకుంటున్న టైం లోనే.. ఈ తరుణంలో బన్నీ ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ప్రెజెంట్ ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.. ఎలాగో స్టైలిష్ స్టార్ అక్కడ., దానికి ఇంకొంచెం స్టైల్ యాడ్ అయితే ఇంక స్పెషల్ గా చెప్పేది ఏం ఉంటుంది. ఇంకా సూపర్ స్టైలీష్ గా కనిపిస్తున్నారు బన్ని.

పుష్ప సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది. ఇందులో సంయుక్త కథానాయికగా అని టాక్.