
జనరల్లీ సిల్వర్ స్క్రీన్ మీద బిజీగా ఉన్న హీరోయిన్ల పేర్లే న్యూస్ హెడ్ లైన్స్ లో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ రూల్ ను బ్రేక్ చేస్తున్నారు కొంతమంది అందాల భామలు. పెద్దగా సినిమాలు లేకపోయినా వార్తల్లో ఉండేందుకు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు.

చాలావరకు సక్సెస్ కూడా అవుతున్నారు. సమంత కాంపౌండ్ నుంచి సినిమా అప్డేట్స్ కన్నా ఎక్కువగా పర్సనల్ అప్డేట్స్ వస్తున్నాయి. అమ్మ వెకేషన్ ట్రిప్స్, రిలేషన్‌షిప్ న్యూస్ తో సోషల్ మీడియా మోత మోగితోంది.

ఇది చాలుదనట్లుగా తన మార్క్ స్టేట్ మెంట్స్ తో మీడియా అటెన్షన్ ని గ్రాబ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. తాజాగా సక్సెస్ అంటే స్వేచ్ఛగా ఉండటమే అంటూ శాం చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

రీసెంట్ గా అనుష్క కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అయ్యారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న స్వీటీ పేరు అన్ని ఇండస్ట్రీలో మారుమోగితోంది. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న పాన్ ఇండియా మూవీ ఘాట్ తో పాటు మలయాళం మూవీ ఖతనార్, తమిళ సినిమా ఖైదీ 2 తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు అనుష్క.

సీనియర్ బ్యూటీస్ ఏ కాదు యంగ్ హీరోయిన్స్ కూడా న్యూస్ హెడ్ లైన్స్ లో ఫ్లాష్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. త్వరలో మిత్ర మండలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నిహారిక ఎన్ ఎం తొలి మూవీ ఈవెంట్ తోనే న్యూస్ మేకర్ గా మారారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ దృష్టిని ఆకర్షించి ఆన్ లైన్ లోను ట్రెండ్ అవుతున్నారు ఈ యంగ్ బ్యూటీ.