Cinema OTT: సైకో భర్తతో కన్నీళ్ల కాపురం.. భార్యతో బలవంతపు శృంగారం.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..

Updated on: Mar 26, 2026 | 4:28 PM

ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుందన్న సంగతి తెలిసిందే. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ డ్రామాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఒక సినిమా మాత్రం అందరినీ ఆలోచించేలా చేస్తుంది. సైకో భర్తతో ఓ అమ్మాయి కన్నీళ్ల జీవితం కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో హాట్ టాపిక్ గా మారింది.

1 / 5
బాలీవుడ్ నటి దివ్య దత్తా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ చిరాయ. ఇటీవల విడుదలైన ఈ హిందీ వెబ్ సిరీస్ ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి భాషలలోనూ అందుబాటులో ఉంది. వైవాహిక అత్యాచారం అనే కాన్సెప్ట్ అధారంగా దీనిని తెరకెక్కించారు. వివాహం తర్వాత మహిళ సమ్మతి ముఖ్యమై విషయం అనే విషయాన్ని ఈ సిరీస్ తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది.

2 / 5
తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనే కాకుండా ఇతర ప్రాంతీయ భాషలలోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. పెళ్లి తర్వాత తన ఇంట్లో కష్టాలను, మానసిక క్షోభను ఎదుర్కొనే  ఒక యువ వివాహిత చుట్టూ తిరిగే హృదయాన్ని కదిలించే కథ. వివాహిత స్త్రీ సమ్మతి ఎంత ముఖ్యమైనదో.. అవసరమైనదో ఈ సిరీస్ ప్రాముఖంగా తెలియజేస్తుంది.  శశాంత్ షా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో ప్రసన్న బిష్త్, సిద్ధార్థ్ షా కీలకపాత్రలు పోషించారు.

3 / 5
ఇందులో మొత్తం ఆరు ఎపిసోడ్‌లు ఉన్నాయి. విషపూరిత పురుషాహంకారాన్ని తెలియజేసే కీలకమైన సిరీస్ ఇది. చిన్నతనం నుండే భారాన్ని అమ్మాయిలపై మోపకుండా, అబ్బాయిలకు సమ్మతి, ఇతరుల స్వయంప్రతిపత్తిని గౌరవించడం, ఇంట్లో పితృస్వామ్య వైఖరులను సవాలు చేయడం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఈ సిరీస్ తెలియజేస్తుంది.

4 / 5
 కథ విషయానికి వస్తే.. కమ్లేష్ అనే మహిళ ఉమ్మడి కుటుంబానికి పెద్ద కోడలు. తన మరిది చాలా మంచివాడని.. ఎవరికీ అపకారం చేయడని నమ్మిన ఆమె అతడికి పూజా అనే అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపిస్తుంది. పెళ్లి తర్వాత అరుణ్ అసలు రూపం బయటపడుతుంది. భార్య ఇష్టంతో పనిలేకుండా ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించే సైకో భర్త అతడు. అతడి వేధింపుల నుంచి బయటపడేందుకు ఆమె ఎంతో ప్రయత్నిస్తుంది.

5 / 5
కానీ తన తల్లి మద్దతు కూడా ఆమెకు లభించదు. భర్త ఎలా ఉన్న సర్దుకుపోవాలి అని చెప్పే మాటల మధ్య మానసికంగా కుంగిపోయే అమ్మాయి కథ ఇది. తన భర్త బారి నుంచి చివరకు ఆ అమ్మాయి ఎలా బయటపడింది.. ? ఆమెకు ఎవరు సహయం చేశారు. ? ప్రస్తుతం ఈ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 11 భాషల్లో అందుబాటులో.. గృహ హింస, వైవాహిక అత్యాచారాల తీవ్రతను కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సిరీస్, భారీ స్థాయిలో విడుదలైంది.

Follow Us