
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లలో జెనీలియా ఒకరు. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో బొమ్మరిల్లు, నా అల్లుడు, సాంబ, ఆరెంజ్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమాతో సినీరంగంలోకి తెరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంది. అందం.. అద్భుతమైన యాక్టింగ్.. అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అందుకే ఇప్పటికీ ఆమెను హాసినీ అని ముద్దుగా పిలుచుకుంటారు ఫ్యాన్స్.

అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది జెనీలియా. వీరికి ఇద్దరు అబ్బాయిలు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. పిల్లలు, భర్త అంటూ కుటుంబంతోనే గడిపేసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది.

క్రేజీ ఫోటోషూట్లతోపాటు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ సైతం పంచుకుంటుంది. చాలా సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా.. ఇప్పుడిప్పుడే సినీరంగంలోకి రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా అమీర్ ఖాన్ సరసన సితారే జమిన్ పర్ సినిమాలో నటించింది. ప్రస్తుతం జెనీలియా వయసు 37 సంవత్సరాలు.

ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల జెనీలియా డైట్ సీక్రెట్ సైతం రివీల్ చేసిన సంగతి తెలిసిందే. నాన్ వెజ్ పూర్తిగా మానేసి.. కేవలం మొక్కల ఆధారిత ఫుడ్ మాత్రమే తీసుకుంటుందట. అలాగే పాల ఉత్పత్తులకు దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటుందట.