
తమిళ స్టార్ హీరో అజిత్.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొంది తర్వాత హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించిన బేబీ షాలినీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు (ఆద్విక్ కుమార్).. కుమార్తే (ఆనౌష్క కుమార్)ఉన్నారు. షూటింగ్ లేని సమయంలో అజిత్ ఎక్కువగా తన పిల్లలతో గడుపుతుంటారు.

దలపతి విజయ్.. 1999లో సంగీతను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు (జాన్సన్ సంజయ్).. కుమార్తే (దివ్య సాషా.) ఉన్నారు. విజయ్ కుమారుడు 2009లో వెట్టైకరన్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెరిసాడు. అలాగే విజయ్ కుమార్తే.. థెరి సినిమాలోనూ నటించింది.

శివకార్తికేయన్.. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ 2010లో ఆర్తినని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె (ఆరాధన). 2018లో విడుదలైన కన్నా సినిమాలో తన కూతురి చేత పాట పాడించాడు కార్తికేయన్.

తమిళ స్టార్ హీరో సూర్య.. హీరోయిన్ జ్యోతిక 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు (దేవ్), ఒక పాప (దియా సూర్య).

Celebrity Stars With Their