
దక్షిణాది చిత్రాలతో నటిగా తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ భాషలలో వరుస అవకాశాలు అందుకుని.. నెమ్మదిగా హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. అందం, అభినయంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న ఈ వయ్యారి.

ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న ఈ హీరోయిన్.. తెలుగు సినీప్రియులకు పరిచయమే. ఈ రోజు ఆమె పుట్టినరోజు కావడంతో.. సోషల్ మీడియా వేదికగా సినీప్రియులు, అభిమానులు ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ కృతి ఖర్బంద.

2009లో బోని సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీతోనే కథానాయికగా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఈ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినప్పటికీ.. ఆ తర్వాత 2013లో యష్ సరసన గూగ్లీ సినిమాతో కన్నడలోకి అడుగుపెట్టింది. ఆమె నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది.

తెలుగులో పవన్ కళ్యాణ్, త్రిష కలిసి నటించిన తీన్ మార్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని జోడిగా ఒంగోలు గిత్త చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కృతికి అంతగా పాపులారిటీ రాలేదు. కృతికి ఎక్కువగా తెలుగులోనే అవకాశాలు వచ్చాయి. రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ ది ఫైటర్ చిత్రంలో కీలకపాత్ర పోషించింది.

2016లో, ఆమె రాజ్ రీబూట్ ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అలాగే ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించింది. తెలుగు, కన్నడ, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. 2021లో 14 ఫేర్ అనే సినిమాతో ఓటీటీలోకి రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ లో అవకాశాలు తగ్గిపోవడంతో.. ఆమె బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్ ను 2024లో పెళ్లి చేసుకుంది.