Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

Updated on: Mar 16, 2026 | 1:41 PM

సినిమా ప్రపంచంలో ప్రేమ పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. మొదటి సినిమాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడం.. ఆ తర్వాత పెళ్లితో ఒక్కటి కావడం చూస్తుంటాం. అయితే కొందరు తమ ప్రేమ విషయాన్ని ముందే ప్రకటించగా.. మరికొందరు మాత్రం సంవత్సరాలుగా తమ ప్రేమ విషయాన్ని దాచిపెట్టేస్తారు. చివరకు పెళ్లి బంధంతో తమ ప్రేమను తెలియజేస్తున్నారు.

1 / 5
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ అంటే గుర్తొచ్చే జంటలు చాలా ఉన్నాయి. అందులో మనం మాట్లాడుకుంటున్న జంట ఒకటి. 15 ఏళ్ల వయసులోనే కథానాయికగా తెరంగేట్రం చేసిన హీరోయిన్. మొదటి సినిమాలోని హీరోతో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత వెంటనే ప్రేమగా మారింది.

2 / 5
ఆ సమయంలో హీరో వయసు 24 సంవత్సరాలు. తర్వాత ఇద్దరూ ఎవరి కెరీర్ లో వారు బిజీ అయిపోయారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదలైన హీరోయిన్ ప్రయాణం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ కు చేర్చింది. తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకుంది.

3 / 5
ఆ జంట మరెవరో కాదు.. జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్. వీరిద్దరి ప్రేమకథ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ తొలిసారి 2002లో కలిశారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇద్దరు మొదటిసారిగా తుఝే మేరీ కసమ్ సినిమాలో కనిపించారు.

4 / 5
ఆ సమయంలో, జెనీలియా వయసు కేవలం 15 సంవత్సరాలు, రితేష్ వయసు 24 సంవత్సరాలు. మొదట్లో రితేష్ రాజకీయ నాయకుడి కొడుకు కావడంతో అహంకారిగా భావించిందట. కానీ తర్వాత ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. సినిమా పూర్తయ్యేనాటికి ఇద్దరూ ప్రేమలో పడిపోయారు.

5 / 5
 ఫస్ట్ మూవీ తర్వాత ఇద్దరూ ఎవరి కెరీర్ లో వాళ్లు బిజీగా అయ్యారు. దాదాపు పదేళ్లు ప్రేమలో ఉన్నారు. కానీ ఈ కాలంలో, వారు తమ ప్రేమను ఎప్పుడూ బహిరంగంగా ప్రకటించలేదు. జెనీలియా, రితేష్ 2012లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు జన్మించారు.

Follow Us