అఖండ 2 అనుకున్న టైమ్‌కు మొదలవుతుందా..? లేదంటే ముందు ప్లాన్ చేసిన దానికంటే ఆలస్యం కానుందా..? ఉన్నట్లుండి ఇప్పుడు ఈ అనుమానాలు ఎందుకొస్తున్నాయి అనుకుంటున్నారు కదా..?
మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య.. ఈ మధ్యే బాబీ సినిమా లొకేషన్లోకి ఎంట్రీ ఇచ్చారు. NBK 109 షూట్ ప్రస్తుతం హిమాయత్ సాగర్‌లో జరుగుతుంది. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ షూటింగ్ ముంబైలో జరుగుతుంది.
ప్రస్తుతం ఈయన కమిటైన బాలయ్య బాబీ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు బాలయ్య. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు బాబీ.
ఇది సెట్స్‌పై ఉండగానే బోయపాటి సినిమాకు ఓకే చెప్పారు NBK. బాబీ సినిమా మరో రెండు నెలల్లో పూర్తయ్యేలా కనిపిస్తుంది. మొన్నటి వరకు పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు కాబట్టి లేట్ అయింది కానీ లేదంటే ఈ పాటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యేది.
అన్నీ కుదిర్తే ఆగస్ట్ నుంచి బోయపాటి సినిమాను సెట్స్‌పైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు బాలయ్య. అయితే ముందు అనుకున్న కథలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది.
బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటే పొలిటికల్ పంచులు కూడా బాగానే ఉంటాయి. ఈ విషయంలోనే స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం కానుంది.
అందుకే అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా సెట్స్‌పైకి వచ్చేలా ఉంది బాలయ్య, బోయపాటి సినిమా. ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్‌తో 14 రీల్స్, బాలయ్య చిన్న కూతురు తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.